ఛత్తీస్‌గఢ్‌కు చెందిన విలేకరి ముఖేశ్ కుమార్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. పోస్టుమార్టం నివేదిక చూసి పోలీసులు షాకయ్యారు. గుండెను చీల్చినట్లు గుర్తించారు. 15 చోట్ల ఎముకలు విరిగాయని గుర్తించారు. లివర్‌పై గాయాలున్నాయని నివేదిక ద్వారా తెలుస్తోంది. ఈ హత్యలో ఇద్దరు కన్నా ఎక్కువ మంది పొల్గొని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇంత దారుణమైన పోస్టుమార్టం ఇటీవల కాలంలో చూడలేదని డాక్టర్లు చెబుతున్నారు.
బస్తర్ ప్రాంతంలో జరిగిన అవినీతిని విలేకరి ముఖేశ్ కుమార్ వెలుగులోకి తీసుకువచ్చారు. గంగలూరు నుంచి హిరోలి వరకు రూ.120 కోట్లతో చేపట్టిన రోడ్డు పనుల్లో అవినీతిని వెలికితీశాడు. తొలుత రూ.50 కోట్లతో పనులు చేశారు. తరవాత మరో రూ.120 కోట్లతో పనులు చేశారు. ఇందులో జరిగిన అవినీతిని వెలికితీశాడు. మీడియాలో కథనాలు వచ్చినప్పటి నుంచి ముఖేశ్ కనిపించకుండాపోయాడు.
మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు కాంట్రాక్టర్ సురేశ్ చంద్రకర్ ఇంటి సెప్టిక్ ట్యాంకులో వెతక్కా ముఖేశ్ శవమై కనిపించాడు. చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా అతన్ని గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికి ముగ్గురుని అరెస్ట్ చేశారు.
ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు, కాంట్రాక్టర్ సురేశ్ చంద్రకర్‌ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఇతడు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగంలో నాయకునిగా గుర్తించారు. హత్య జరిగిన రోజు నుంచి పరారీలో ఉన్నాడు. సీసీ టీవీల ఫుటేజీ ఆధారంగా అతన్ని అరెస్ట్ చేశారు. చంద్రకర్ బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు.
విలేకరి ముఖేశ్‌కు వరుసకు సోదరుడయ్యే రితేశ, సూపర్వైజర్ మహేంద్రతో భోజనం సమయంలో గొడవైంది. దీంతో వారు ముఖేశ్‌పై ఇనుప రాడ్డుతో దాడి చేశారు. ముఖేశ్ ప్రాణాలు కోల్పోయాడు. శవాన్ని సెప్టిక్ ట్యాంకులో పడేశారు. సిమెంటుతో మూసివేశారు. ముఖేశ్‌కు చెందిన ఫోన్, హత్యకు వాడిన ఇనుప రాడ్డును కనపడకుండా పడేశారని పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది.