చిత్తూరు జిల్లాలో ఘోరం జరిగింది. చంద్రగిరి మండలం నరసింగాపురం గ్రామం వద్ద శ్రీవారి భక్తులపైకి 108 వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాలినడకన తిరుమలకు చేరుకుంటోన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
మృతులు అన్నమయ్య జిల్లా చెంపాలపల్లి గ్రామానికి చెందిన రెడ్డ రెడ్డమ్మ, లక్ష్మమ్మగా గుర్తించారు. గాయపడిన వారిన తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.108 అంబులెన్సులో మదనపల్లె నుంచి తిరుపతికి రోగిని తీసుకెళుతుండగా డ్రైవర్ పట్టుకోల్పోయినట్లు పోలీసులు చెబుతున్నారు.