హైందవ డిక్లరేషన్:
హిందూ దేవాలయాల గురించి ముఖ్యమంత్రికి, ఉపముఖ్యమంత్రికి, కేంద్రంలో అధికారంలో ఉన్న నాయకత్వానికీ ఒక ముసాయిదాను అందజేసినట్లు హిందూ డిక్లరేషన్లో వెల్లడించారు. ప్రభుత్వ అధీనంలో ఉన్న దేవాలయాలను హిందూ సమాజానికి అప్పగించాలని డిక్లరేషన్ చేశారు.
తక్షణమే తీసుకోవలసిన చర్యలను ప్రకటించారు
హిందూ దేవాలయాలకు పూర్తి స్వయంప్రతిపత్తి కల్పిస్తూ చట్టసవరణ వెంటనే చేయాలి
హిందూ సమాజంపై దేవాలయాలపై దాడులు జరగకుండా చూడాలి
పండుగల సమయంలో ఆర్థిక ఆంక్షలు విధించరాదు
హిందూ శోభాయాత్రలపై అక్రమ ఆంక్షలు విధించరాదు
దేవాలయాల్లో పూజా ప్రసాద కైంకర్యాలను భక్తిశ్రద్ధలతో నాణ్యతతో నిర్వహించాలి
దేవాలయాల్లో అన్యమత ఉద్యోగులను తక్షణమే తొలగించాలి
ట్రస్టు బోర్డుల్లో హిందూధర్మంపై శ్రద్ధ కలిగిన రాజకీయేతర వ్యక్తులను మాత్రమే నియమించాలి
ఆలయ ఆస్తులను అన్యాక్రాంతం కానీయరాదు, ఇప్పటికే అన్యాక్రాంతం అయిన వాటిని స్వాధీనం చేసుకుని ఆలయాలకు అప్పగించే బాధ్యత ప్రభుత్వం చేపట్టాలని హైందవ శంఖారావంలో డిక్లరేషన్‌లో ప్రకటించారు.