దేవాలయాలు మనకు కేవలం శ్రద్ధాకేంద్రాలు కాదు, సమాజ నిర్మాణ కేంద్రాలు. ఆగమార్ధం తు దేవానాం అంటూ అందరినీ పిలిచి ఆగొన్న వారికి అన్నం పెట్టిన ధర్మశాలలు, శారీరక అనారోగ్యంతో వచ్చిన వారికి కల్వం పెట్టి ఆరోగ్యం ఇచ్చిన కేంద్రాలు ఆలయాలు, మానసిక అనారోగ్యంతో వచ్చిన వారికి చిత్తశాంతి కల్గించిన కేంద్రాలు ఆలయాలని విరజానంద స్వామీజీ గుర్తుచేశారు. మన దౌర్భాగ్యం మన మీద ఎన్నో అసత్య ప్రచారాలతో మతమార్పిడులు జరుగుతున్నాయి. దారిద్ర్యము, అనారోగ్యము, అసమానతలు…
అసమానతల గురించి చెబితే శబరిని ఆదరించిన రాముణ్ణి, విదురుణ్ణి ఆదరించిన కృష్ణుణ్ణి గుర్తుచేయాలి
ఎందరో అవతార మూర్తులు నిమ్నవర్ణాలుగా చెప్పబడుతున్న వాటిలో జన్మించారు. సామాజిక సమరసత ద్వారా ఎన్నో దేవాలయాల నిర్మాణం జరిగింది… తాత ముత్తాతల త్యాగాలకు వారసులుగా మనం ఇతర మతాల్లోకి మారకుండా మన పూర్వుల మార్గంలో నడవాలి. పాలకులు తాము పరమాత్మ సేవకులమని గుర్తించాలి
కృష్ణదేవరాయల పాలన స్వర్ణయుగం. ఆయన ఏనాడూ ఏ దేవాలయం మీదా పెత్తనం చేయలేదు. దేవుడి రధం ముందు చీపురుతో ఊడ్చాడు. ఆయన నేటి పాలకులకు ఆదర్శం కావాలి. సద్బుధ్ధి కలిగించాలి.
సనాతన ధర్మం ఒక్కటి నిలబడితే ప్రపంచం మొత్తం ప్రశాంతంగా నిలబడుతుందని ప్రపంచం గుర్తించింది. మన దేశస్తులు మాత్రమే గుర్తించాలి. భారత్ మాతా కీ జై