సనాతన ధర్మంలో గోవుకు విశిష్టస్థానం ఉంది. గావో విశ్వస్య మాతరః. విశ్వానికే తల్లి గోవు.
వేదాలలో 1331సార్లు గో ప్రస్తావన వస్తుంది. క్షీరసాగర మథనంలో గోవు ఆవిర్భవించి పంచగోవులుగా మారి ఆ కామధేనువే భూమిమీద గోమాతగా జన్మనిస్తుంది. హిందూధర్మంలో గోవుకు విశేషమైన ప్రాధాన్యం ఉందని శైవపీఠం శివస్వామీజీ గుర్తుచేశారు.
శ్రీకాకుళం నుంచి చెన్నై వరకూ ఎన్నో గోవులు వధించబడుతున్నాయి. వాటిని రక్షించడానికి గో సంరక్షకులు ప్రయత్నించినప్పుడు ఎన్నో నాటకాలు మొదలవుతాయి. ఫిర్యాదు చేసిన వారి పైనే కేసులు పెడుతున్నారు.
ఈ హైందవ శంఖారావం వేదిక మీదనుంచి ఒక సంకల్పం చేసుకుందాం… గోవును జాతీయప్రాణిగా ప్రకటించాలని సంకల్పం చేద్దాం. అఖండభారత నిర్మాణమే ధ్యేయంగా ప్రయత్నం చేద్దాం.