మన ధర్మం సనాతనం, పురాతనం, ప్రాచీనం, వైదిక ప్రమాణం కలిగినది. మన ధర్మం పుచ్చుకునేది కాదు, మనం పుట్టిందే ఈ ధర్మంలో. మన ధర్మం పుచ్చిపోయేది కాదు, మరచిపోయేది కాదు. అది మన జీవన విధానమని శివానంద సరస్వతీ మాతాజీ అన్నారు. ఈ జీవన విధానాన్ని చూసి సహించలేక, విదేశాల నుంచి ఆశ్రయం కోరి వచ్చిన అన్యమతాల వారు మన మీదనే దాడి చేస్తున్నారు. ఎవరి కర్మ వారు అనుభవిస్తారు, మనమెందుకు పూసుకోవడం అనుకోవడం జడత్వం, అవివేకపు ఆలోచనతో ఇన్నాళ్ళూ సహించుకుంటూ వచ్చాం. ఇకపై సహించేది లేదు.
మతమౌఢ్యం ఏమిటి, ధర్మ దార్ఢ్యత ఏమిటో మనం తెలుసుకోవాలి. మన ధర్మానికి దార్ఢ్యం ఉంది కాబట్టే కొద్దిరోజుల్లో ప్రయాగలో మొదలయే కుంభమేళా ఇక్కడే సాక్షాత్కారమయింది.
కాషాయం అగ్నివర్ణం, అది దేన్నయినా దగ్ధం చేస్తుంది. సహనం సహనం సహనం అని నొక్కిపెట్టడంతో హిందూజాతి కాస్త ఉపేక్ష వహించింది. ఇప్పుడు ఉపేక్షించడానికి సమయం లేదు. అన్యమతస్తులు మనను… మతం తీసుకుంటే బతుకుతావు లేదా చస్తావు అంటారు. మీరు కాఫిర్లు, సైతాన్లు అంటూ చంపేస్తారు. బాలవీరులు జొరావర్ సింగ్, ఫతేసింగ్…. మతం మారకపోతే చంపేస్తామన్నా మతం మారలేదు, ప్రాణాలు వదిలేసారు.
ఆశ్రయం కోరి వచ్చిన మతస్తులు ఇప్పుడు ఆ భూములు మావి, ఈ భూములు మావి అని ఆక్రమించడానికి ప్రయత్నిస్తుంటే ఇంకా సహనంగా ఉండకూడదు.
అందుకే విశ్వహిందూ పరిషత్ ఈ శంఖారావం చేపట్టింది. ఇక్కడ హైందవ జనసాగరాన్ని చేరదీసింది.
ఈ సాగరం ఎదురుగా వచ్చే కెరటాలను ఉపేక్షించకూడదు. స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ పేరుతో ఇన్నాళ్ళూ ఇతర మతాలను గౌరవించాము, ఆదరించాము. రామాయణాన్ని చూస్తే రాముడు ఎందుకు ఊరుకోలేదు… రాక్షస సంహారం చేసాడు, రావణుణ్ణి వధించాడు. ఆ రామనామంతో హనుమంతుడు రాక్షసులను నలిపి చంపేసాడు.
సర్వ ఆదరణ సరే… దేన్ని ఆదరించకూడదో కూడా నేర్చుకోవాలి. రాముడు విభీషణుణ్ణి ఆదరించాడు, రావణుణ్ణి వధించాడు. అదే మనకు ఆదర్శం.
మన ధర్మంలోని విస్తృత విశాల భావన కొంతవరకే మంచిది. శరీరంలో ఒక భాగం కుళ్ళిపోయి, దాన్ని తీసేయాలని వైద్యులు చెబితే దాన్ని తీసేస్తాం కదా. అలాగే అన్యమతస్తులు చేస్తున్న దాడులను ఉపేక్షించకూడదు.
శతకంఠ రావణుడిని సీతాదేవి హనుమంతుడి మీద కూర్చుని వధించిందని పరాశర సంహిత చెబుతోంది. అలాంటి శక్తిని మన స్త్రీ సమాజం ఆవహించుకోవాలి. మన దేవాలయాలను మనం రక్షించుకోవాలి. కృష్ణుడు దగ్గరుండి అర్జునుడితో యుద్ధం చేయించాడు. విహెచ్పి సంకల్పం సిద్ధించాలని కనకదుర్గమ్మను ప్రార్థిస్తున్నాను. జై శ్రీరాం.