శంఖం అంటేనే జయం. మనం ఆశిస్తున్న అపేక్షిస్తున్న విషయానికి జయం కలగాలని దత్తుడిని ప్రార్థిస్తున్నానని దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. హిందూ సంస్కృతికి 5120 సంవత్సరాలు. హిందూరాష్ట్రం దేవలోకం అని విదేశీయులే చెబుతుంటారు. ఎన్నో పుణ్యనదులు, పర్వతాలు. దేవుడే అవతారాలు దాల్చడానికి ఈ భూమిని ఎంచుకున్నాడు. ఇక్కడ పుట్టడం మన అదష్టం.
ఈ దేశంలో ప్రతీ ఆలయం గొప్ప దాతలు కట్టించారు. అలాంటి ఆలయాలను మనం రక్షించుకోవాలి.
మన హ్యాపీ న్యూ ఇయర్ ఉగాది. మనం కేకులు కోయకూడదు, దీపాలు ఆర్పకూడదు. హైందవ ధర్మం ఇచ్చిన ఈ పిలుపు దిగంతాలకు చేరాలి, మన ప్రార్థన పరమాత్ముడికి చేరాలి.ఒక్క నినాదం శక్తి ఆ ప్రాంతంలో దశాబ్దాల పాటు నిలిచి ఉంటుంది.మన ధర్మాన్ని మనం పాలించుకోవాలి. దత్తాత్రేయుడు మీ ఆ కాంక్షలను నెరవేర్చు గాక.