దేశంలో సుమారు 12కోట్ల మంది గిరిజనులు ఉన్నారు. 700 భాషలు మాట్లాడే తెగలున్నాయి.
స్వతంత్ర పోరాటంలో గిరిజనులు కూడా పెద్దసంఖ్యలో పాల్గొని ప్రాణాలు అర్పించారని హిందూ వనవాసి నాయకులు గుర్తుచేశారు.
అలాంటి గిరిజన సోదరులు తెలిసో తెలియకో మతాంతరీకరణం చెందుతున్నారు. రాజ్యాంగం దానికి విరుద్ధమన్న సంగతి వారికి తెలియడం లేదు. మతాంతరీకరణ వల్ల 80శాతం నిజమైన గిరిజనులు నష్టపోతున్నారు.
స్వధర్మాన్ని విడిచి అన్యమతాలకు వెళ్ళిన గిరిజనుల రిజర్వేషన్లు తొలగించాలని ప్రభుత్వాలను కోరాం. భారీ ర్యాలీలు నిర్వహించామని వారు గుర్తు చేశారు.