ఈ దేశంలో ఎస్సీ కులాల వారు కూడా హిందువులే. కులం మన వ్యక్తిగతం. ధర్మం మన స్వయం, మనం ధర్మ రక్షకులమని ఎస్సీ నేత గరికముక్కు సుబ్బయ్య గుర్తుచేశారు. సమరసతా సేవా ఫౌండేషన్ ద్వారా ఎందరో ఎస్సీ ఎస్టీలకు అర్చక శిక్షణ ఇప్పించి ఆలయాల్లో నియమింపజేసాం.
రాజ్యాంగం ప్రకారం ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చారు. అస్పృశ్యత అంటరానితనానికి గురైన కొన్ని కులాలకు, హిందూ ధర్మాన్ని ఆచరించే సనాతన ధర్మ ఆచరణ చేసేవారికి మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చారు. హిందూ ధర్మాన్ని ఆచరించే అంటరానితనాన్ని అనుభవిస్తున్నవారికే రిజర్వేషన్లు అని రాజ్యాంగంలో స్పష్టం చేసారు. అన్యమతస్తులకు రిజర్వేషన్లు లేవు అని స్పష్టంగా రాజ్యాంగంలో చెప్పారు.
ఇవాళ అన్యమతాల్లోకి మారిపోయి రిజర్వేషన్లు వాడుకుంటున్నారు. అది రాజ్యాంగ వ్యతిరేకం. రిజర్వేషన్ సర్టిఫికెట్లు ఎవరికి ఇస్తున్నారు…. ప్రభుత్వాధికారులు, రాజకీయ నేతలూ గమనించాలి. మతం మారిన వారికే రిజర్వేషన్లు ఇస్తున్నారు.. అది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. మతం మారిన వారికి రిజర్వేషన్లు ఇవ్వకూడదు. అన్ని కులాల్లో ఉన్నవారూ హిందువులే. మతం మారినవారందరూ వెనక్కి రావాలి.
రాజ్యాంగ సభలో చర్చ జరిగే సందర్భంలో క్రైస్తవులు ఒకటి చెప్పారు… మా మతంలో కులం లేదు, అంటరానితనం లేదు.. అని చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు పాటిస్తున్నారు? హిందూ ధర్మంలో ఉండండి… లేకుండా మరో మతంలోకి వెడితే రిజర్వేషన్లు వాడుకునే హక్కు మీకు లేదు. అది అంబేద్కర్ స్పష్టంగా చెప్పారు. ఎండోమెంట్ గుడుల్లో హిందువులైన ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ప్రాధాన్యం కల్పించండి. అన్యమతస్తులకు అవకాశం ఇవ్వవద్దు. అన్ని గుడుల్లో అర్చకులుగా ఎస్సీ ఎస్టీలకు ప్రాతినిధ్యం కల్పించాలి. మేమంతా హిందువులు, సనాతన ధర్మవాదులం, భారత్ మాతా కీ జై.