సనాతన ధర్మ పరిరక్షణ కోసం, పునర్వైభవ పునరుద్ధరణ కోసం లక్షలాదిగా తరలివచ్చిన హిందూ బంధువులకు ప్రణామం, ఇవాళ అన్ని కళలకూ సినిమా చిరునామా అయిపోయింది. అయితే వ్యాపారాత్మకమైపోయిన సినిమా, హిందూధర్మానికి ఆపద కలిగించిందని బహిరంగంగా చెబుతున్నానరు గేయ రచయిత అనంత శ్రీరామ్. ఆ ప్రమాదం కలగజేసిన సినీరంగం తరఫున క్షమాపణ చెబుతున్నాను. సరస్వతీ శిశుమందిర్ లోనే నేను చదువుకున్నాను.
సినిమాల్లో హైందవ ధర్మం మీద దాడి మూడు కోణాల్లో జరుగుతుంది.. కావ్యేతిహాసపురాణాల వక్రీకరణ: వాల్మీకి రామాయణాన్ని వ్యాస భారతాన్నీ వక్రీకరించిన సంఘటనలు కోకొల్లలు. కల్కి సినిమాలో కర్ణుడిని గొప్పవాడిగా చూపించడమనే నేరం చేసింది మన సినిమా.
భీరువైన కర్ణుడిని వీరుశూరుడిగా చూపడం ద్వారా వ్యాసభారతాన్ని కల్కి సినిమా వక్రీకరించింది. అలా ఎన్నో సినిమాల్లో ఎన్నో వక్రీకరణలు. 2. పాత్రల్లో పాటల్లో హైందవ ధర్మాన్ని చిత్రీకరణలో దమ్ మారో దమ్ అనే పాట ద్వారా ఇస్కాన్ నినాదం హరేకృష్ణ హరేరామ్ గా పెడితే ఒప్పుకున్నాం. కాళి అనే డాక్యుమెంటరీలో కాళికా పాత్రధారి సిగరెట్ కాలుస్తుంటే, పీకే అనే సినిమాలో అమీర్‌ఖాన్ సినిమాలో శివలింగాన్ని అవమానించారు. కాస్మిక్ సెక్స్ అనే సినిమాలో సాధువులు తమ శిష్యురాళ్ళతో శృంగార క్రీడలు చేస్తున్నట్లు అవమానకరంగా చూపించారు.
ఎంఎఫ్ హుసేన్ సరస్వతి దుర్గలను నగ్నంగా చిత్రించాడు, మరో చిత్రకారుడు కృష్ణుణ్ణి బార్లో కూచోబెట్టి గోపికలను బికినీల్లో చూపించాడు.మన ముందు రెండే దారులు .. నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం… నిగ్గదీసి అడగడం… దేన్ని ఎంచుకుందాం. హరేరామ హరేకృష్ణ నినాదాన్ని సీతారామశాస్త్రిగారు అద్భుతంగా పాటలో రాసారు… అదీ పాట ద్వారా సమాజ హితం కోరడమంటే… తెర వెనుక మాముందు అన్యమతస్తులు చేసే దుర్మార్గాలు…హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలను ప్రభుత్వం బహిష్కరణ కంటె ముందు ప్రజలే తిరస్కరించాలి. డబ్బులు రానప్పుడు ఏ నిర్మాత హిందువులను వెటకరిస్తూ సినిమాలు తీస్తాడో చూడాలి… జైహింద్