రాముడే ధర్మం. ధర్మమే అమ్మ. తల్లి పిల్లలకు భక్తిని నేర్పించడం మన సంప్రదాయం. కానీ ఇవాళ స్త్రీమూర్తులు శాస్త్రాలు, వేదాలు నేర్చుకోవడం నిషేధంగా భావిస్తున్నారు. మన స్త్రీమూర్తులు ఝాన్సీ లక్ష్మిగా, జిజాబాయిగా తయారవాలంటే వేదాలు శాస్త్రాలు నేర్చుకోవాలి, అప్పుడే ఆలయాలను ప్రభుత్వాల కబ్జా నుంచి విడిపించుకునే అవకాశం ఉంటుందని కొండవీటి జ్యోతిరమ్మయి మాతాజీ అభిప్రాయపడ్డారు. లవ్ జిహాద్ నుంచి మన అమ్మాయిలను కాపాడుకోవాలంటే మన శాస్త్రాలు, మన సంప్రదాయాలను నేర్చుకోవాలి, ఆలోచన చాలా ఉంది, ఆచరణ కావాలి.
వ్యక్తిత్వ వికాసానికి కొత్త కోర్సులు అవసరం లేదు, భాగవతాన్ని అధ్యయనం చేయాలి. సోల్‌ను డెవలప్ చేసుకోవాలి.
వేదం మనకు ఏం చేయకూడదో చెప్పలేదు, ఏం చేయాలో చెప్పింది.
ఆలయాలు ప్రభుత్వం చేతినుంచి విముక్తం కావాలని 20 ఏళ్ళుగా అడుగుతున్నాను. మన స్త్రీలకు వేదాధ్యయనం నేర్పించాల్సిన ఆవశ్యకత ఇప్పుడు వచ్చింది. అది చేసి తీరాలి. లేదంటే మన మూలాలు మనకు తెలీవు. అందుకోసం దేవాలయాలు ప్రభుత్వం నుంచి విముక్తం కావలి. భారతీయులు వెలుగులో జీవించడానికి అపేక్షిస్తారు, చీకట్లో మగ్గిపోడానికి ఇష్టపడరు. అయోధ్యే దానికి నిదర్శనం.దేవాలయాల భూముల వివరాలను స్త్రీమూర్తులు సేకరించాలి. వాటిగురించి ఆరా తీయాలి. మన శక్తి ఏమిటో, మన సనాతన ధర్మం మూలమేమిటో మన పిల్లలకు మన స్త్రీలే చెప్పాలని జ్యోతిర్మయి మాతాజీ అభిప్రాయపడ్డారు. ఆధ్యాత్మం అంటే దేవుణ్ణి నమ్మడం కాదు, దేవుణ్ణి తెలుసుకోవడం. దానికోసమే మన ఆలయాలను మన చేతిలోకి తీసుకోవాలి. అప్పుడే మన ముందు తరాలకు ఏమివ్వాలో అది ఇవ్వగలుగుతామన్నారు.