దేవదాయ శాఖని రద్దు చేయాలన్నది మన ప్రధాన ఆశయం. మన దేవాలయాలను రాజులు, జమీందార్లు, భక్తులు కట్టించారు. కానీ వాటితో సంబంధం లేని ప్రభుత్వాలు – సినిమా హాళ్ళలో టికెట్లు అమ్ముకుంటున్నట్లు దర్శనం టికెట్లు, ప్రసాదం టికెట్లు అమ్ముకుంటున్నారని కమలానంద స్వామీజీ ధ్వజమెత్తారు. వాళ్ళకు గుడులతో ఏం సంబంధం. నెల రోజుల క్రితమే విశ్వహిందూ పరిషత్ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ముఖ్యమంత్రికి ఇచ్చిన పత్రమే ప్రజలకూ ఇచ్చింది. ఆ రోజు నుంచే హిందూ బంధువులు ఈ కార్యక్రమానికి వెళ్ళడానికి సంసిద్ధులయ్యారు.
ఆ చట్టం పేరే హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టం. గుడుల్లో బోర్డుల మీద అదే పేరు ఉండేది. ఇప్పుడు దేవాలయాల మీద హిందూ శబ్దం తీసేసారు. హిందువుల్లో జాగృతం లేనందునే అలా జరిగింది.
గుడులపై దాడులు, హుండీల దోపిడీ, ఆభరణాలు, ఆస్తుల దోపిడీ… అన్నింటికీ కారణం హిందువుల్లో జాగృతి లేకపోవడం.
2006-07 సంవత్సరంలో షామీర్‌పేట మండలంలో ఒక రామాలయంలో భూముల అన్యాక్రాంతం గురించి గొడవ జరిగితే ప్రభుత్వం ఒక కమిషన్ వేసింది. ఇప్పటివరకూ ఆ కమిషన్ నివేదిక వెలుగు చూడలేదు.
దేవాలయ ఆస్తులను ప్రభుత్వాలు సైతం కబ్జా చేసి తమ కార్యాలయాలు కట్టేసుకుంటున్నాయి. భక్తుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాయి. గుడిలో దైవాల విగ్రహాల కంటె హుండీలే ఎక్కువ పెట్టారు. భక్తులందరినీ డబ్బులు వేసేలా ప్రోత్సహిస్తున్నాయి. కర్ణాటకలో మూడేళ్ళ క్రితం దేవదాయ శాఖ తొలగించి, హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించే చట్టం దాదాపు తయారైంది. అంతలో ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆ చట్టం అటకెక్కిందని కమలానంద స్వామి గుర్తుచేశారు.
మన సంప్రదాయాలను మనం గౌరవించుకోవాలి.
మత్స్యావతార దేవాలయం నాగలాపురం మన ఆంధ్రప్రదేశ్
కూర్మావతార దేవాలయం శ్రీకూర్మం ఆంధ్రప్రదేశ్
వరాహావతార దేవాలయం తిరుమల ఆంధ్రప్రదేశ్
నరసింహావతార దేవాలయం మహానంది ఆంధ్రప్రదేశ్
వామనావతార దేవాలయం ప్రకాశం జిల్లా పరుచూరు మండలం చెరుకూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉంది
పరశురామావతార దేవాలయం మహేంద్రపర్వతం శ్రీకాకుళం జిల్లాలో ఉందని కమలానంద గుర్తుచేశారు.
రామావతారం ఉత్తరప్రదేశ్, కృష్ణావతారం ఉత్తరప్రదేశ్
కలియుగ వైకుంఠం వేంకటేశ్వరస్వామి అవతారం తిరుమల ఆంధ్రప్రదేశ్
కాబట్టి… ఆంధ్రప్రదేశ్‌ను దేవభూమిగా ప్రకటించాలి. దేవాలయ క్షేత్రాలను అభివృద్ధి చేయాలి
జైశ్రీరాం… వందేమాతరం… భారత్ మాతా కీ జై.