దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కోరుతూ హైందవ శంఖారావం
హిందూ ధర్మానికి మూలస్తంభాలు దేవాలయాలని వీహెచ్పి జాతీయ ఉపాధ్యక్షులు గోకరాజు గంగరాజు స్పష్టం చేశారు. దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం ఈ కార్యక్రమానికి విహెచ్పి పిలుపు మేరకు వచ్చిన హిందూ బంధువులకు ఆయన స్వాగతం పలికారు. దేవాలయాల రక్షణకు ఎందరో పోరాటాలు, త్యాగాలు, బలిదానాలు చేశారు. వేల సంవత్సరాలుగా మన దేవాలయాలు దాడులకు, దోపిడీలకు గురవుతున్నాయి. స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళయినా పరిస్థితిలో మార్పు లేదు. దేవాలయాలను ప్రభుత్వాలు గుప్పెట్లో పెట్టుకున్నాయి. ఆలయాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చాయి. దేవాలయాలు హిందువుల చేతిలో ఉంటే నిర్వహణ ధార్మికంగా ఉంటుంది. ఇటీవల దేవాలయాలపై దాడులు జరుగుతున్న సంఘటనలు హిందువులను కలచివేస్తున్నాయని గంగరాజ ఆందోళన వ్యకం చేశారు.
దేవాలయాలు హిందువుల జీవనాడి. వాటిని కాపాడుకోవాలి. దేవాలయాల
అన్య మతస్తులు, నాస్తికులను ఉద్యోగులుగా, ట్రస్టుబోర్డు సభ్యులుగా చేర్చకూడదని గంగరాజు డిమాండ్ చేశరు. అలా జరగాలంటే దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కావాలన్నారు. హిందూ శంఖారావ సభ భారత్లో దేవాలయాల విముక్తి పోరాటానికి నాంది పలుకుతుందన్నారు. ఇలాంటి కార్యక్రమం దేశంలో మొదటిసారి ఈ కార్యక్రమం జరుగుతోందని ఆయన గుర్తుచేశారు. ఆలయాలకు స్వయంప్రతిపత్తి సాధించేందుకు నడుం కడదాం, దానికి పూజ్య స్వామీజీల ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నానంటూ గంగరాజు ప్రసంగం ముగించారు.