హైందవ శంఖారావానికి దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ప్రముఖులు తరలివచ్చారు. వందలాది ప్రముఖులు తరలివచ్చిన సభా కార్యక్రమాల కన్వీనర్గ తనికెళ్ళ సత్య రవికుమార్ అతిథులను అందరికీ పరిచయం చేశారు. ఈ కార్యక్రమానికి విశ్వహిందూ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు గోకరాజు గంగరాజు, అయోధ్య రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద దేవగిరి మహరాజ్ త్రిదండి రామానుజ శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామీజీ, విహెచ్పి అఖిల భారత అధ్యక్షులు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అలోక్ కుమార్, అఖిల భారత సంఘటనా ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే, భువనేశ్వరీ పీఠాధిపతి కమలానంద భారతీ స్వామీజీ, అచలానందాశ్రమం, బ్రహ్మంగారి మఠం కడప విహెచ్పి అంతర్జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వర శర్మ, ఏపీ గవర్నమెంట్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం, శివానంద సరస్వతి హాజరయ్యారు.
అమరావతి రాజధాని తాళ్ళాయపాలెం శైవక్షేత్రం శివస్వామీజీ, మాతా కొండవీటి జ్యోతిర్మయి అమ్మ, హైందవ శంఖారావం ధ్యేయగీతం రచయిత చేగొండి అనంతశ్రీరామ్, వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ్ బాధ్యులు, ధర్మక్షేత్రం నిర్వాహకులు అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగేవరకూ కురులు ముడివేయను అని శపథం చేసిన మాతృమూర్తి సత్యవాణి, వబిలిశెట్టి శ్రీవెంకటేశ్వర్లు, విహెచ్పి విష్ణువర్ధన్ రెడ్డి, హైందవ శంఖారావం కోకన్వీనర్ ఇతర విహెచ్పి నాయకులు సభకు విచ్చేశారు.