సంస్కార భారతి ఆధ్వర్యంలో నాటక ప్రదర్శన
సంస్కార భారతి ఆధ్వర్యంలో ప్రదర్శించిన జయహో ఛత్రపతి శివాజీ మహరాజ్ నాటకం అందరినీ ఆకట్టుకుంది. ఛత్రపతి శివాజీ మహరాజ్ జీవితంలోని ప్రేరణదాయకమైన ఘట్టాలు, మొఘల్ పాలకులపై శివాజీ సాధించిన విజయాలు, దేశభక్తి ప్రపూరితమైన శివాజీ అనుచరులు, యుద్ధనీతి, యుద్ధ రీతి, సనాతన ధర్మం పట్ల శివాజీ అంకిత భావాన్ని ఈ నాటికలో కళ్లకు కట్టినట్లు తెలిపారు.
డాక్టర్ రామన్ ఫౌండేషన్, శ్రీసాయిబాబా నాట్యమండలి విజయవాడ వారు ఈ నాటికలో పాత్రధారులుగా ఉండగా రచన, దర్శకత్వం పాత్రను పి.వి.ఎన్ క్రిష్ణ నిర్వహించారు.
లలిత కళల ద్వారా సమాజ సంఘటనకు అఖిల భారతీయ సంస్థ అయిన సంస్కార భారతి కృషి చేస్తోంది. ఈ సంస్థ 1981 లో ఆగ్రా నగరంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ విష్ణు శ్రీధర్ వాకన్‌కర్ చే ప్రారంభించబడింది.