దేవాలయాలను ప్రభుత్వాల కబంధ హస్తాల నుంచి కాపాడాలంటూ ‘‘ మన దీక్ష- దేవాలయాల రక్ష’’ నినాదంతో హైందవ శంఖారావం పేరిట భారీ బహిరంగ సభను విశ్వహిందూ పరిషత్ నిర్వహిస్తోంది. నేడు (జనవరి 5) ఉదయం పదిగంటలకు విజయవాడ సమీపంలోని కేసరపల్లి వద్ద ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ సభకు దాదాపు 5 లక్షల మంది వస్తారని నిర్వాహకులు అంచనా వేశారు. అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ సభల్లో సనాతన ధర్మానికి చెందిన పలువురు ప్రముఖులు, హిందూ మత రక్షకులు పాల్గొని ప్రసంగిస్తారు.
హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కోసం ఈ సభ వేదికగా తీర్మానం చేసి ప్రభుత్వాలకు పంపనున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆలయాలపై జరుగుతున్న దాడులను ప్రస్తావించనున్నారు. దాదాపు 100 మంది పీఠాధిపతులు వస్తారని నిర్వాహకులు చెబుతున్నారు.