ప్రపంచ అపరకుబేరుల్లో ఒకరైన ‘ఇలాన్ మస్క్’ సోషల్ మీడియా అకౌంట్ లో తన పేరు మార్చుకోవడం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వ్యాపార, రాజకీయ రంగాల్లో క్షణం తీరికలేకుండా గడిపే ఇలాన్ మస్క్ ఎక్స్ ఖాతా పేరు ను మార్చాడు.
‘కేకియస్ మాక్సిమస్’ పేరు మార్చుకోవడంతో దాని అర్ధం కోసం నెటిజన్లు గుగూల్ లో తెగ వెతుకుతున్నారు. పేరు వింతగా ఉండటంతో చాలా మంది దాని గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రొఫైల్ లో తన ఫోటోకు బదులు పెపే ద ఫ్రాగ్ ఫోటో పెట్టుకోవడంపై నెటిజన్లు తలోరకంగా స్పందిస్తున్నారు.
కేకియస్ అనేది ఓ క్రిప్టో కరెన్సీ టోకెన్ కాగా ఇది అనేక బ్లాక్‌చెయిన్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది.ఇలాన్ మస్క్ కొన్ని రోజులుగా క్రిప్టో కరెన్సీకి మద్దతు తెలుపుతున్నాడు. 2023లో కూడా ఇదే తరహా చర్యకు ఇలాన్ మస్క్ పాల్పడ్డాడు. తన ఎక్స్ ఖాతా పేరును ‘మిస్టర్ ట్వీట్’గా మార్చుకున్నారు.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ నివేదిక ప్రకారం ప్రపంచకుబేరుడైన మస్క్ సంపద 447 బిలియన్ డాలర్లు గా ఉంది. స్పేస్‌ఎక్స్ అంతర్గత వాటా విక్రయంతో సంపాదన సుమారు 50 బిలియన్ డాలర్లు పెరిగినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.
2022 వరకు మస్క్ సంపద నికర విలువ 200 డాలర్ల కంటే తక్కువ. అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందిన తరువాత.. మస్క్ సంపాదన భారీగా పెరిగింది. తాజాగా 400 బిలియన్ డాలర్లు దాటేసింది. భారత కరెన్సీలో మస్క్ సంపద విలువ సుమారు రూ. 33.20 లక్షల కోట్లు.