పంత్ హాఫ్ సెంచరీ …
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్ట్ రెండో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న బారత్ ప్రస్తుతం 145 పరుగుల ఆధిక్యంలో ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ లో భారత్ ఇప్పటివరకు 32 ఓవర్లు ఆడి 141 పరుగులు చేసింది.
రెండో రోజు జరిగిన ఇన్నింగ్స్ లో భారత ఓపెనర్లు విఫలం అయ్యారు. యశస్వీ జైస్వాల్ 35 బంతులు ఆడి 22 పరుగులకు పెవిలియన్ చేరాడు. కేఎల్ రాహుల్ 20 బంతులు ఎదుర్కొని 13 పరుగులు మాత్రమే చేశాడు. శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ కూడా విఫలం అయ్యారు. ఓపెనర్లు ఇద్దరూ బోలాండ్ బౌలింగ్ లో బోల్డ్ కాగా, శుభమన్, విరాట్ లు క్యాచ్ ఔట్ గా వెనుదిరిగారు.
రిషబ్ పంత్ 29 బంతుల్లో అర్ధ శతకం కొట్టాడు. ఆ తర్వత 61 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పాట్ కమిన్స్ బౌలింగ్ లో క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. దీంతో 124 పరుగులు వద్ద భారత్ ఐదో వికెట్ నష్టపోయింది. ఆ తర్వాత నితీశ్ కుమార్ కూడా వెంటనే వికెట్ కోల్పోయాడు.
ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 181 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ కు నాలుగు పరుగుల ఆధిక్యం లభించింది. ఓవర్ నైట్ స్కోర్ 9/1తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ ను ఆదిలోనే బూమ్రా దెబ్బతీశాడు. లబుషేన్ (2)ను క్యాచ్ ఔట్ చేశాడు. దీంతో 15 పరుగులు వద్ద ఆసీస్ రెండో వికెట్ నష్టపోయింది. ఆసీస్ లో ఒకే సిరీస్ లో అత్యధిక వికెట్లు(32) తీసి రికార్డు క్రియేట్ చేశాడు. అంతకు ముందు ఈ ఘనత బిషన్ సింగ్ బేడీ (31) పేరిట ఉంది. ఆయన 1977-78 సిరీస్ లో 31 వికెట్లు తీసినట్లు బీసీసీఐ వెల్లడించింది.
కొన్‌స్టాస్ వికెట్ ను సిరాజ్ తన ఖాతాలో వేసుకుని ఆ తర్వాత ట్రావిస్ హెడ్ ను కూడా పెవిలియన్ కు పంపాడు. దీంతో ఆసీస్ 39 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. 12 వ ఓవర్ ఐదో బంతికి ట్రావిస్ హెడ్ (4), స్లిప్ క్యాచ్ గా దొరికిపోయాడు.
ఆ తర్వాత క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నిస్తున్న డేంజరస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (33)ను ప్రసిధ్ ఔట్ చేశాడు. దీంతో 96 పరుగులు వద్ద ఆసీస్ ఐదో వికెట్ నష్టపోయింది. ఆ తర్వాత కేరీని కూడా ప్రసీద్ నే వెనక్కిపంపాడు. దీంతో 38 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్, ఆరు వికెట్లు నష్టపోయి 137 పరుగులు చేసింది.
పాట్ కమిన్స్, స్టార్క్ వికెట్లను నితీశ్ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకు ముందు ఫీల్డింగ్ లో సబ్‌స్టిట్యూట్ గా బూమ్రాకు బదులు అభిమన్యు ఈశ్వరన్ వచ్చాడు. దీంతో కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించాడు. బూమ్రాను వైద్య బృందం స్కాన్ కు తీసుకెళ్లింది.
ఆసీస్ అరంగేట్రం ఆటగాడు వెబ్ స్టర్ (57)ను ప్రసీధ్ ఔట్ చేయడంతో ఆసీస్ 9 వికెట్ కోల్పోగా, ఆ తర్వాత బోలాండ్ (9)ను సిరాజ్ బౌల్డ్ చేశాడు. దీంతో 181 పరుగులకు ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో భారత్ కు 4 పరుగులు ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 185 పరుగులు చేసింది.