ఉత్తరాది రాష్ట్రాలను చలి వణికిస్తోంది. పొంగమంచు కమ్మేయడంతో ఢిల్లీలోనే 30 విమానాలు రద్దు చేశారు. 200 విమాన సర్వీసులను దారి మళ్లించారు. వందలాది రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విజిబిలిటీ సున్నాకు పడిపోయింది. దీంతో రవాణా నిలిచిపోయింది.. ఇవాళ ఉదయం ఢిల్లీల్లో కనిష్టంగా 10.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
దేశ రాజధాని ఢిల్లీతోపాటు, జైపూర్, ఘజియాబాద్, చంఢీగడ్, అమృత్సర్, సిమ్లా, లక్నో, పాట్నా ప్రాంతాల్లో పొగమంచు కమ్మేసింది. దీంతో విమాన సేవల రద్దు చేశారు. ఉదయం 11 గంటల వరకు రోడ్డుపై వాహనాలు డ్రైవింగ్ ప్రమాదకరంగా మారింది. పొగమంచు కారణంగా అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
వాతావరణ శాఖ అందించిన వివరాల ప్రకారం ఢిల్లీలో 8వ తేదీ వరకు పొగమంచు కురిసే అవకాశాలు కనిపిస్తున్నారు. చిరు జల్లులు కూడా పడవచ్చు. ప్రజలు, ముఖ్యంగా వాహనాలు నడిపే వారు జాగ్రత్తలు పాటించాలని వాతావారణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీలో కాలుష్యం కూడా 309కి పెరిగింది. దీంతో జనం అవస్థలు పడుతున్నారు.