గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో హిందువులకు చెందిన రెండు దుకాణాలను ధ్వంసం చేసిన ఘటనలో 9మంది ముస్లిములను పోలీసులు అరెస్ట్ చేసారు. నిందితులు డిసెంబర్ 31 రాత్రి ఆ రెండు దుకాణాల యజమానులను బెదిరించారు. ఆ దుకాణాలు వక్ఫ్ ఆస్తులని చెబుతూ బలవంతంగా చట్టవిరుద్ధంగా ఖాళీ చేయించారు. నిందితుల్లో ఒకరు రాజ్‌కోట్‌లోని నవాబ్ మసీదు ట్రస్టీ కూడా. మసీదు చేరువలో ఉన్న దుకాణాలను వక్ఫ్ ఆస్తులుగా క్లెయిం చేసుకుని ఆ దుకాణాలను ధ్వంసం చేసి, దుకాణదారులను బెదిరించి ఖాళీ చేయించారు.
నవాబ్ మసీదు ట్రస్టీ ఫరూఖ్భాయ్ ఇబ్రహీంభాయ్ మూసానీ, జకీర్భాయ్ హబీబ్భాయ్ మూసానీ, గఫార్భాయ్ సతార్భాయ్ అలానీ, ఇర్ఫాన్భాయ్ అబ్దుల్భాయ్ సోలంకీ, ఫరీద్భాయ్ తయాబ్భాయ్ షికార్, యూనుస్భాయ్ హాజీభాయ్ మూసానీ, అమీన్‌భాయ్ మహమూద్భాయ్ చౌహాన్, ఇక్బాల్భాయ్ కమల్భాయ్ షైతానీ, సర్ఫరాజ్ మహ్మద్భాయ్ షేక్ అనే తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. పోలీసులు హిందూ దుకాణదారులకు వారి దుకాణాలను వెనక్కి ఇచ్చారు.
అసలేం జరిగిందంటే… :
2024 డిసెంబర్ 31 రాత్రి నవాబ్ మసీదు ట్రస్టీ ఫరూఖ్ మూసానీతో పాటు సుమారు 25మంది ముస్లిముల గుంపు మసీదు చేరువలో ఉన్న రెండు హిందువుల దుకాణాలపై విరుచుకుపడ్డారు. దుకాణాలను ధ్వంసం చేసి లోపలున్న వస్తువులను రహదారిమీద విసిరేసారు. ఫరూక్ మూసానీ ‘గుజరాత్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ ఉత్తర్వులు’ అంటూ కొన్ని కాగితాలను చూపిస్తూ ఆ దుకాణాలు వక్ఫ్ ఆస్తులనీ, వాటిని వెంటనే ఖాళీ చేయాల్సిందేనంటూ జులుం చేసాడు. ‘మీ దుకాణాలు పాత అద్దె ఒప్పందాల్లో ఉన్నాయి, ఇప్పుటికిప్పుడు మీరు దుకాణాలు ఖాళీ చేయాల్సిందే’ అంటూ ముస్లిములు విధ్వంసానికి పాల్పడ్డారు.
తమ దుకాణాలను అక్రమంగా ఖాళీ చేయిస్తున్నారంటూ వీరేంద్రభాయ్ కళ్యాణ్‌జీ భాయ్ కొటేచా అనే వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దాని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి 9మందిని అరెస్ట్ చేసారు. మసీదు ట్రస్టీ ఫరూఖ్ మూసానీ మాత్రం ఆ దుకాణాలు వక్ఫ్ ఆస్తులేననీ, వాటి విషయంలో చట్టపరంగా ముందుకు వెడతామనీ ఇంకా బెదిరిస్తున్నాడు.