స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు కొత్త డిపాజిట్ స్కీమ్‌లు అందుబాటులోకి తీసుకొచ్చింది. హర్ ఘర్ లఖ్‌పతి, ఎస్‌బీఐ ప్యాట్రాన్స్ పేరుతో వీటిని తీసుకొచ్చినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
హర్‌ఘర్ లఖ్‌పతి అనేది రికరింగ్ డిపాజిట్ (RD) పథకం కాగా, రూ.1 లక్ష లేదా ఆపై రూ.లక్ష చొప్పున నిధులను సమకూర్చుకోవడానికి ఉద్దేశించిన పథకాన్ని తీసుకొచ్చినట్లు వివరించింది. మైనర్లకూ ఈ పథకం అందుబాటులో ఉండటం విశేషం.
ఎస్‌బీఐ ప్యాట్రన్స్ అనేది సీనియర్ సిటిజన్లకు ఉద్దేశించిన పథకం కాగా దీనిని 80 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారి కోసం తీసుకొచ్చింది. దీనిలో భాగంగా అధిక వడ్డీని అందిస్తారు. డిపాజిట్ల విషయంలో 23 శాతం మార్కెట్ వాటాతో ఎస్‌బీఐ అగ్రస్థానంలో ఉండగా, కనీసం 12 నెలల నుంచి గరిష్ఠంగా 120 నెలల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకునే అవకాశం ఎస్బీఐలో ఉంది.