హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ కు ఊరట లభించింది.అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ థియేటర్ కు రావడంతో అభిమానులు పరుగులు పెట్టారు. దీంతో తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఘటనపై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు, అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు. అయితే అదే రోజు ఆయనకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రెగ్యులర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ , నాంపల్లి కోర్టును ఆశ్రయించారు . పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు జారీ చేసింది. రూ. 50 వేలు దరావత్తుతో పాటు ఇద్దరు వ్యక్తులు ష్యూరిటి ఇవ్వాలని ఉత్తర్వుల్లో న్యాయస్థానం పేర్కొంది.