ఛత్తీస్గఢ్ లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన సోర్నామల్ అటవీ ప్రాంతం మరోసారి తుపాకీమోతతో దద్దరిల్లింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. గరియాబాద్ జిల్లా ఇందగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సొర్నామల్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనలో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు.
అటవీ ప్రాంత పరిధిలో మావోయిస్టులు నక్కి ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్ జవాన్లు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఒడిశాలోని నవరంగపూర్కు చెందిన భద్రతా సిబ్బంది కూడా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఈ ఆపరేషన్లో ముగ్గురు నక్సలైట్లు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు అదనపు ఎస్పీ జితేంద్ర చంద్రశేఖర్ తెలిపారు.