డేరా సచ్చా సౌద అధ్యక్షుడు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2002లో రంజిత్ సింగ్ హత్య కేసులో అప్పటి డేరా మేనేజరైన గుర్మీత్ సింగ్కు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.ఈ కేసులో పంజాబ్,హర్యానా హైకోర్టు తీర్పులను సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజీవ్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఇప్పటికే ఈ కేసును జస్టిస్ ఎం. త్రివేది నేతృత్వంలోని బెంచ్ విచారించి తదుపరి విచారణకు పంపిన సంగతి తెలిసిందే.
2002లో హర్యానాలోని కురక్షేత్ర ఖాన్పూర్ కాలనీలో రంజిత్ సింగ్ అనుమానాస్పదంగా చనిపోయారు. గుర్మీత్ రామ్ రహీమ్ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అవి బయట పెట్టినందుకే రంజిత్ హత్య జరిగిందని కేసు నమోదైంది. హత్య ప్రదేశంలో దొరికిన లేఖ ఆధారంగా కేసును విచారించిన సీబీఐ కోర్టు ఐదుగురికి శిక్ష విధించింది. నిందితులు పంజాబ్ హర్యానా హౌకోర్టులో సవాల్ చేశారు. 2024లో వారికి హత్యకు సంబంధం లేదని హైకోర్టు తీర్పు వెలువరించడంతో ఐదుగురు హత్య కేసు నుంచి బయటపడ్డారు.
2017లో హర్యానాలోని గుర్మీత్ సింగ్ ఆశ్రమంలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ పెద్ద వివాదం చెలరేగింది. తరవాత చెలరేగిన అల్లర్లలో 30 మంది చనిపోయారు. 250 మందికిపైగా గాయపడిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపుల కేసులో జైలు శిక్ష అనుభవించిన గుర్మీత్ సింగ్ ఇటీవలే విడుదలయ్యారు.