సంక్రాంతి ప్రయాణ రద్దీకి తగ్గట్లుగా ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు భారత రైల్వే తెలిపింది. ఈ మేరకు విజయవాడ డివిజన్ రైల్వే పీఆర్‌వో నుస్రత్ మండ్రుప్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
కాచిగూడ–కాకినాడ టౌన్ (07653) రైలు ఈనెల 9, 11 తేదీల్లో పరుగులు తీయనుంది. రాత్రి 8.30 గంటలకు కాచిగూడలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ టౌన్ చేరనుంది.
తిరుగు ప్రయాణంలో భాగంగా (07654) సర్వీసు ఈనెల 10, 12 తేదీల్లో సాయంత్రం 5.10 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు కాచిగూడ చేరనుంది.
హైదరాబాద్–కాకినాడ టౌన్ (07023) సర్వీసు ఈనెల 10న సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు కాకినాడ చేరనుందని ప్రకటనలో వివరించారు.
ఈ సర్వీసు తిరుగు ప్రయాణంలో (07024) 11న రాత్రి 8 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ చేరనుంది.