క్విక్ ఈ కామర్స్ సంస్థ బ్లింకిట్ , అంబులెన్స్ సర్వీసును కూడా అందిస్తోంది. ఆర్డర్ చేసిన పది నిమిషాలకే నిత్యావసరాలు డోర్ డెలివరీ చేస్తున్న బ్లింకిట్ ఇప్పుడు రోగులకు సాయం అందించేందుకు సిద్ధమైంది. సరుకులు పదినిమిషాలకే డోర్ డెలీవరీ చేసినట్లుగానే అంతే సమయంలో అంబులెన్స్ కూడా రోగుల చెంతకు చేరనుంది.
తొలుత గురుగ్రామ్ లోని కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ సేవలను బ్లింకిట్ ప్రారంభించింది. బ్లింకిట్ యాప్‌లోనే ఈ సేవలు అందుబాటులో ఉన్నట్లు యాజమాన్యం వివరించింది.
అంబులెన్సుల్లో ఆక్సిజన్ సిలిండర్, స్ట్రెచర్, మానిటర్, అత్యవసర మందులు, ఇంజెక్షన్లు, వీల్‌చెయిర్ అందుబాటులో ఉంటాయి. ఈ సౌకర్యాలతో పాటు పారా మెడికో, సహాయకుడు, డ్రైవర్ ఉంటారు. వీరంతా కలిసి అత్యవసర సమయంలో రోగులకు సేవలందిస్తారు.
వచ్చే రెండుమూడేళ్లలో ఈ సేవలు అన్ని ప్రధాన నగరాలకు విస్తరిస్తామని బ్లింకిట్ సీఈఓ అల్బిందర్ ధిండ్సా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.