భద్రాచలంలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో శ్రీ వైకుంఠ ఏకాదశీ అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రాములవారు రోజుకు ఒక అవతారంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. నాలుగో రోజు ఉత్సవాల్లో భాగంగా నేడు స్వామివారు నేడు నరసింహ అవతారంలో భక్తులను కటాక్షిస్తారు.
ప్రియభక్తుడైన ప్రహ్లాదుడిని అనేకవిధాలుగా బాధ పెట్టిన హిరణ్యకశిపుడు అనే రాక్షసుడిని సంహరించేందుకు నారాయణుడు నరసింహావతారాన్ని ధరించాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ అలంకరణలో స్వామిని దర్శిస్తే కుజ గ్రహ బాధలు తొలుకుతాయని విశ్వాసం.
స్వామివారు గురువారం నాడు లోకకంటకుడైన హిరణ్యాక్షుడిని సంహరించిన వరాహావతారంలో భక్తులకు దర్శనమిచ్చాడు. శనివారం నాడు రామచంద్రస్వామి వామనావతారంలో భక్తులను కటాక్షిస్తారు.