నిషేధిత పబ్జీ గేమ్ ఆడుతూ ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బిహార్‌లోని చంపారన్ జిల్లాలో చోటు చేసుకుంది. నార్కటియాగంజ్, ముజఫర్ పుర్ రైల్వే మార్గంలో పట్టాలపై పబ్జీ ఆడుకుంటుండగా వారిపై నుంచి రైలు దూసుకెళ్లింది. దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
పబ్జీ ఆడిన యువకులు ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడంతో రైలు కూత వినిపించలేదని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిని ఫర్కాన్ ఆలం, సమీర్ ఆలం, హబాబుల్లా అన్సారీగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం సమాచారం తెలియగానే రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.
పబ్జీ గేమ్‌ను దేశంలో నిషేధించారు. అయినా కొందరు చాటుగా విదేశాలకు చెందిన వెబ్ సైట్ల నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఆడుతున్నారని పోలీసులు గుర్తించా రు. గతంలోనూ పబ్జీ ఆడుతూ ఎంతో మంది యువత ప్రాణాలు పొగొట్టుకున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం పబ్జీ నిషేధించింది. రైలు పట్టాలపై కూర్చోవమే నేరం, ఇక పబ్జీ ఆడటం మరింత ప్రమాదకరమని రైల్వే పోలీసులు హెచ్చరిస్తున్నారు.