విశాఖ సముద్ర తీరంలో జనవరి 4న జరగనున్న నేవీ విన్యాసాల సన్నాహక వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఇద్దరు నావికులు విమానం నుంచి ప్యారాచూట్ సాయంతో దూకారు. గాలి అనుకూలించకపోవడంతో ఆ రెండు ప్యారాచూట్లు మెలేసుకున్నాయి. దీంతో నావికులు సముద్రంలో పడిపోయారు. అక్కడే ఉన్న జెమిని బోట్ల సాయంతో వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
విశాఖ తీరంలో నిర్వహించిన సన్నాహక డ్రోన్ షో ఆకట్టుకుంది. వివిధ చిత్రాలు వచ్చేలా డ్రోన్లతో చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. దేశ పటం,ఫైటర్ జెట్, సబ్ మెరైన్, సైనికుడు, మేకిన్ ఇండియా, కళింగ చక్రవర్తి, సింహం చిత్రాలు డ్రోన్ షోలో ప్రదర్శించారు. రేపు జరగనున్న నేవీ విన్యాసాలకు 5 లక్షల మంది హాజరవుతారని అంచనా వేశారు. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.