భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో దేవాలయాల నిర్వహణ పేరిట ప్రభుత్వాలు గుడులను కబ్జా చేసి, వాటి ఆస్తులను దుర్వినియోగం చేస్తున్న తీరు, ఆలయాల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని చెడగొట్టి డబ్బులు దోచుకుంటున్న తీరు, లౌకికవాదం పేరిట ఆలయాల్లో అన్యమతస్తులకు ఉద్యోగాలిచ్చి, వారిద్వారా అన్యమత ప్రచారానికి ఆస్కారం కల్పిస్తున్న తీరు, ఇంకా పలు రకాల అరాచకాలకు గుడులు నెలవులవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి సమస్యలన్నింటికీ పరిష్కారంగా దేవాలయాలను ప్రభుత్వ అధీనంలోనుంచి విడిపించాలనే డిమాండ్‌తో విశ్వహిందూ పరిషత్ దేశవ్యాప్త కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. దానికి శ్రీకారంగా ఆంధ్రప్రదేశ్ విజయవాడ సమీపంలోని కేసరపల్లిలో 2025 జనవరి 5న ‘హైందవ శంఖారావం’ అనే భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది.
హైందవ శంఖారావం మహాసభకు రెండు లక్షల మందికి పైగా ప్రజలు తరలివస్తారని అంచనా. దానికోసం పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే జాతీయ రహదారిపై రవాణా సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆ ఆంక్షలు ఇలా ఉన్నాయి…
(1) విశాఖపట్నం నుండి చెన్నై వైపు వెళ్ళు వాహనాలు (కాకినాడ జిల్లా):
కత్తిపూడి సెంటర్ నుండి వయా కాకినాడ-యానాం-అమలాపురం-రాజోలు-నరసాపురం-మచిలీపట్నం-రేపల్లె-బాపట్ల మీదుగా ఒంగోలు వెళ్ళాలి
(2) చెన్నై నుంచి విశాఖపట్నం వైపు వెళ్ళు వాహనాలు (ప్రకాశం జిల్లా):
ఒంగోలు నుండి త్రోవగుంట-బాపట్ల-రేపల్లి-అవనిగడ్డ-మచిలీపట్నం-లోస్రా బ్రిడ్జి-నరసాపురం-అమలాపురం-కాకినాడ-కత్తిపూడి మీదగా విశాఖపట్నం వైపు వెళ్ళాలి
(3) చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్ళు వాహనాలు (గుంటూరు జిల్లా):
బడంపాడు క్రాస్ రోడ్ నుండి తెనాలి-పులిగడ్డ-మచిలీపట్నం-లోస్రా బ్రిడ్జ్-నరసాపురం-అమలాపురం-కాకినాడ-కత్తిపూడి మీదగా విశాఖపట్నం వైపు వెళ్ళాలి
(4) విశాఖపట్నం నుండి హైదరాబాద్ వైపు వెళ్ళు వాహనాలు (తూర్పుగోదావరి జిల్లా):
దివాన్ చెరువు-విశాఖపట్నం మీదుగా వయా గామన్ బ్రిడ్జి-దేవరపల్లి-గోపాలపురం-జంగారెడ్డిగూడెం-అశ్వారావు పేట-సత్తుపల్లి-ఖమ్మం మీదుగా సూర్యాపేట వెళ్ళాలి
(5) విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వైపు వెళ్ళు వాహనాలు (ఏలూరు జిల్లా):
భీమడోలు-ద్వారకా తిరుమల-కామవరపుకోట-చింతలపూడి-ఖమ్మం మీదుగా హైదరాబాద్ వైపు వెళ్ళాలి
ఏలూరు బైపాస్-జంగారెడ్డిగూడెం-అశ్వరావుపేట-ఖమ్మం మీదుగా హైదరాబాద్ వెళ్ళాలి
ఏలూరు బైపాస్- చింతలపూడి- సత్తుపల్లి మీదుగా హైదరాబాద్ వెళ్ళాలి
(6) విశాఖపట్నం నుంచి హైదరాబాదు వెళ్ళు వాహనాలు (కృష్ణా జిల్లా):
హనుమాన్ జంక్షన్-నూజివీడు-మైలవరం-ఇబ్రహీంపట్నం-నందిగామ మీదుగా హైదరాబాద్ వెళ్ళాలి
(7) హైదరాబాదు నుంచి విశాఖపట్నం వెళ్ళు వాహనాలు (ఎన్టిఆర్ జిల్లా):
నందిగామ-మధిర-వైరా-సత్తుపల్లి- అశ్వారావుపేట -జంగారెడ్డిగూడెం-దేవరపల్లి-గామన్ బ్రిడ్జి మీదుగా విశాఖపట్నం వైపు వెళ్ళాలి
ఇబ్రహీంపట్నం-మైలవరం-నూజివీడు-హనుమాన్ జంక్షన్-ఏలూరు మీదుగా విశాఖపట్నం వైపు వెళ్ళాలి
రామవరప్పాడు రింగ్-నున్న-పాముల కాలువ-వెలగలేరు-జి.కొండూరు-మైలవరం-నూజివీడు-హనుమాన్ జంక్షన్-ఏలూరు మీదుగా విశాఖపట్నం వైపు వెళ్ళాలి
విజయవాడ-ఎనికేపాడు-100 అడుగుల రోడ్డు-తాడిగడప-కంకిపాడు-పామర్రు-గుడివాడ-భీమవరం మీదుగా విశాఖపట్నం వైపు వెళ్ళాలి
(8) విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్ళేవారు రామవరప్పాడు ఫ్లైఓవర్ మీదుగా ఆంధ్రజ్యోతి, ముస్తాబాద్ సూరంపల్లి అండర్ పాస్ ద్వారా కొత్త బైపాస్ రోడ్డుపై నుండి బీబీ గూడెం అండర్ పాస్ ద్వారా గన్నవరం చైతన్య స్కూల్ జంక్షన్ వద్ద ఎన్ హెచ్ 16 కు వచ్చి అక్కడినుండి విజయవాడ ఎయిర్పోర్ట్ కు వెళ్ళవలెను (సంబంధిత పత్రాలు తప్పనిసరిగా ఉండాలి)
హైందవ శంఖారావం బహిరంగ సభ కోసం చేసిన ఈ ట్రాఫిక్ మళ్ళింపు ఆంక్షల విషయంలో సహకరించి తమ తమ గమ్యస్థానాలకు జాగ్రత్తగా చేరవలసిందిగా కృష్ణాజిల్లా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.