పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు కొనసాగిస్తోంది. తాజాగా గాజా పట్టీపై జరిపిన వైమానిక దాడిలో కీలక ఉగ్రనేతలు హతమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. బుధవారం రాత్రి జరిపిన వైమానిక దాడిలో గాజా పోలీస్ చీఫ్ హసామ్ షాహ్వాన్, హమాస్ కీలక నేత మహమ్మద్ సలాహ్ హతమయ్యారు. షాహ్వాన్ లక్ష్యంగా దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై పాశవికంగా విరుచుకుపడి 1400 మందిని బలిగొన్నాక మొదలైన యుద్ధంలో ఇప్పటి వరకు 50 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల మధ్య జరుగుతోన్న పోరులో హెజ్బొల్లా ఉగ్రవాదులు కూడా ప్రవేశించడంతో పశ్చిమాసియాలో భౌగోళిక పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణకు ఈజిస్ట్, ఖతర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బందీలను విడుదల చేస్తేనే కాల్పుల విరమణ పాటిస్తామని లేదంటే హమాస్ ఉగ్రమూకలను ఏరివేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు స్పష్టం చేశారు. దీంతో కాల్పుల విరమణ చర్చలు విఫలమయ్యాయి.