దేశ ఆర్థిక వ్యవస్థ నుంచి లభించిన సానుకూల సంకేతాలతో స్టాక్ సూచీలు పరుగులు తీశాయి. డిసెంబరులో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో రావడం, వాహనాల కొనుగోళ్లు 25 నుంచి 30 శాతం పెరగడంతో ఆర్థిక వ్యవస్థ పరుగులపై సానుకూల సంకేతాలు వచ్చాయి. దీంతో పెట్టుబడిదారులు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఒక దశలో 1500 పాయింట్లకుపైగా పెరిగిన సెన్సెక్స్ తరవాత కొద్దిగా దిగివచ్చింది.
సెన్సెక్స్ 1436 పాయింట్లు పెరిగి 79943 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 445 పాయింట్లు పెరిగి 24188 వద్ద ముగిసింది. రూపాయి మరింత దిగజారింది. అమెరికా డాలరుతో రూపాయి విలువ 85.74కు పడిపోయింది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో సన్ ఫార్మా నష్టాల్లో ముగిసింది. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్,మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా,టైటన్ షేర్లు లాభాలను ఆర్జించాయి. ముడిచమురు ధర పెరిగింది. బ్యారెల్ క్యూడాయిల్ 75 డాలర్లకు ఎగబాకింది. బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. ఔన్సు బంగారం 2649 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.