క్రీడల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఇచ్చే ఖల్‌రత్న పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 సంవత్సరానికిగాను నలుగురు క్రీడాకారులకు ఖేల్‌రత్న పురస్కారాలు దక్కాయి. వీరిలో చెస్ విభాగంలో డి.గుకేశ్, హాకీలో హర్మన్‌ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ విభాగంలో ప్రవీణ్ కుమార్, షూటింగ్‌లో మను బాకర్‌ను ఈ అవార్డులకు ఎంపిక చేశారు.
32 మందికి అర్జున, ఐదుగురికి ద్రోణాచార్య పురస్కారాలు దక్కాయి. అర్జున అవార్డులు దక్కించుకున్న వారిలో 17 మంది పారా అథ్లెట్స్ ఉన్నారు జనవరి 17 ఉదయం పదకొండు గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ఈ పురస్కారాలు ప్రధానం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, క్రీడల మంత్రి చేతుల మేదుగా ఈ పురస్కారాలు ఇవ్వనున్నారు.
అర్జున అవార్డులు దక్కించుకున్నవారిలో అథ్లెటిక్స్ నుంచి
జ్యోతి యర్రాజి, అన్నురాణి, నీతు, సావీతి, హాకీలో సలీమా, అభిషేక్, జర్మన్‌ప్రీత్ సింగ్ ఉన్నారు. షూటింగ్ విభాగంలో స్వప్నిల్ సురేష్ కుసాలే, అభయ్ సింగ్, సరబ్‌జోత్ సింగ్ ఉన్నారు. అభయ్ సింగ్ స్క్వాష్ విభాగంలో అవార్డులు దక్కించుకున్నారు.
కోచ్‌లు సుభాష్ రాణా పారాషూటింగ్, దపాలీ దేశ్‌పాడే షూటింగ్, సందీప్ సంత్వాన్‌లకు హాకీ విభాగంలో ద్రోణాచార్య పురస్కారాలు లభించాయి. సుచా సింగ్ అథ్లెటిక్స్, మురళీకాంత్ రాజారాం పెట్కర్ పారా స్విమ్మింగ్ విభాగల్లో లైఫ్ టైమ్ అర్జున అవార్డులు దక్కించుకున్నారు.