లాస్ వెగాస్‌లోని ట్రంప్ హోటల్ ముందు టెస్లా కారులో పేలుడు జరిగింది. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. కారులో పేలుడు పదార్థాలు పెట్టి ఈ దురాగతానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. న్యూ ఆర్లీన్స్‌లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఓ దుండగుడు జనాలపైకి కారును దూకించిన ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరింది. ఈ రెండు ఘటనల మధ్య సంబంధం ఉందని ఎలాన్ మస్క్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ రెండు ఘటనలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విచారణకు ఆదేశించారు.
గడచిన ఐదేళ్లలో అమెరికాలో క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయిందని కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. నేరస్థులు ఎక్కువగా వలస వస్తున్నారని తాను చెబితే డెమోక్రాట్లు విమర్శలు చేస్తున్నారని గుర్తుచేశారు. అక్రమ వలసల వల్లే అమెరికాలో నేరాలు పెరిగిపోతున్నాయని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు.
నూతన సంవత్సర వేడుకల్లో న్యూ ఆర్లిన్స్‌లో కారును జనాలపైకి పోనిచ్చి 15 మందిని పొట్టనబెట్టుకున్న నిందితుడిని పోలీసులు కాల్చి చంపారు. ఇతను టెక్సాస్‌కు చెందిన షషుద్దీన్ జబ్బార్‌గా గుర్తించారు. ఇతను అమెరికా పౌరుడు. ప్రమాదం జరిపిన కారులో ఐసిస్ జెండా లభించడంతో ఉగ్రకోణంలో దర్యాప్తు చేస్తున్నారు.