ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ ఇవాళ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈమేరకు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు, విజయవాడ కనకదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానాలకు చెందిన వేద పండితుల దివ్య ఆశీస్సుల మధ్య ఆయన చీఫ్ సెక్రెటరీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.
ప్రధాన కార్యదర్శి బాధ్యతలు స్వీకరించిన తరుణంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జి.సాయి ప్రసాద్, యం.టి. కృష్ణబాబు, టిటిడి ఈఓ శ్యామలరావు, జిఏడి కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు కాంతిలాల్ దండే,జయలక్ష్మి, కుమార్ విశ్వజిత్, పలువురు కార్యదర్శులు ఇతర అధికారులు సిఎస్ కు పుష్ప గుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.