2024 సంవత్సరం చాలా కష్టాల మధ్య ముగిసిందని, అందుకు తనను క్షమించాలంటూ మణిపుర్ సీఎం.బీరెన్ సింగ్ కోరారు. 2024 మేలో కుకీలు, మైతేయ్ తెగల మధ్య మొదలైన అల్లర్లలో 225 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వారంతా శిబిరాల్లో కష్టంగా కాలం గడుపుతున్నారని సీఎం గుర్తుచేశారు. కేంద్ర సాయంతో సాధారణ పరిస్థితులు ఏర్పాడుతున్నాయన్నారు.
మణిపుర్ అల్లర్లను అదుపు చేసేందుకు కేంద్రం 12 వేల బలగాలను పంపించింది. 6 వందల మందిని అరెస్టు చేసి, దాదాపు 5600 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. శిబిరాల్లోని నిరాశ్రయులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు సీఎం చెప్పారు. మణిపుర్లో అల్లర్లు అదుపు చేసేందుకు కేంద్రం చాలా సాయం చేసిందని గుర్తు చేశారు.
మణిపుర్ పరిస్థితులపై సీఎం బీరెన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎనిమిది నెలలుగా మణిపుర్ ఎంతో కోల్పోయిందని, అంతా ప్రశాంతంగా ఉండాలని సీఎం బీరెన్ సింగ్ కోరారు. మణిపుర్ అభివృద్ధిలో ప్రతిఒక్కరు భాగస్వామ్యం కావాలని సీఎం కోరారు. నిర్వాసితుల కోసం త్వరలో వేలాది ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. కొత్త ఏడాదిలో అల్లర్లకు తావులేకుండా సుఖశాంతులతో జీవించాలని సీఎం సూచించారు.