వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. పేర్ని నాని సతీమణి జయసుధకు చెందిన గిడ్డంగిలో పౌరసరఫరాల శాఖ నిల్వ చేసిన బియ్యం మాయం కేసులో పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పేర్ని నాని ఏ6గా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పేర్ని నాని సతీమణి జయసుధ పౌరసరఫరాల శాఖకు లీజుకు ఇచ్చిన గిడ్డంగి నుంచి 373 టన్నుల బియ్యం మాయం చేశారని పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో గిడ్డంగి మేనేజర్ తేజ్, జిల్లా పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, మిల్లర్ ఆంజనేయులు, లారీ డ్రైవర్ మంగారావును పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి వారికి 12 రోజులు రిమాండ్ విధించారు.
రేషన్ బియ్యం అక్రమాల కేసులో వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానిని అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్దమవుతున్నారని తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసి విచారించారు. అనేక బ్యాంకు ఖాతాలు పరిశీలించారు. లక్షల్లో లావాదేవీలు గుర్తించారు. వీటి ఆధారంగా పేర్ని నానిని అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది.