గుడివాడ గడ్డం గ్యాంగ్ నడిపిన వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు కాళీని అస్సాంలో అరెస్ట్ చేశారు.కృష్ణా జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు మెరుగుమాల కాళీపై గుడివాడలో కేసు నమోదైంది. గుడివాడ టీడీపీ కార్యాలయంపై దాడి, రావి వెంకటేశ్వరావు షాపుపై దాడి కేసులో కాళీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కాళీ భూదందాలతో రెచ్చిపోయాడు. గుడివాడ సమీప గ్రామంలోని మల్లాయపాలెంలో 22 ఎకరాల వెంచర్ ప్లాట్లను ఆక్రమించి గూండాలతో యజమానులను బెదిరించిన వ్యవహారంలో కాళీపై కేసు నమోదైంది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాళీ పరారయ్యాడు. అతని కోసం పోలీసులు ఆరు నెలలుగా వెతుకుతున్నారు. అస్సాంలోని టీ తోటలో కాళీ ఉన్నట్లు పోలీసులు గుర్తించి వలపన్ని పట్టుకున్నారు.