ప్రపంచ జనాభా వేగంగా పెరుగుతోంది. 2025 డిసెంబరు 31 నాటికి ప్రపంచ జనాభా 809 కోట్లకు చేరింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలిచింది. తాజా అంచనాల ప్రకారం భారత్ జనాభా 141 కోట్లుగా ఉంది. తరవాత స్థానంలో చైనా నిలిచింది. గత ఏడాది కన్నా 2025లో ప్రపంచ జనాభా 7 కోట్లు పెరిగింది.
అమెరికా జనాభా తాజా గణాంకాల ప్రకారం 34 కోట్లకు చేరింది.అమెరికాలో ప్రతి 9.4 సెనక్లను ఒకరు జన్మిస్తుండగా, ప్రతి 9 సెకన్లకు ఒకరు చనిపోతున్నారు. గత ఏడాది వలసల కారణంగా అమెరికాలో 24 లక్షల జనాభా పెరిగింది.
ప్రపంచంలో అత్యధిక జనాభా ఆసియాలోనే పోగుబడింది. ముఖ్యంగా చైనా, భారత్లోనే 280 కోట్లకుపైగా జనాభా నివసిస్తోంది.ప్రపంచ వ్యాప్తంగా జననాల రేటు 4.2 శాతం ఉండగా, మరణాల రేటు 2 శాతంగా ఉంది. వెరసి ఏటా 2 శాతం జనాభా పెరుగుతోంది.2020లో అమెరికా జనాభా 9.1 కోట్లు పెరిగారు. 2.9 శాతంతో సమానం. 2020లో వలసల కారణంగా అమెరికాలో 7.4 శాతం పెరిగింది. 1930 ఇంత ఎక్కువ స్థాయిలో జనాభా పెరగడం ఇదే మొదటిసారి.