దేశంలో ముఖ్యమంత్రుల కుటుంబాల ఆస్తులను అసోషియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్ప్స్ విడుదల చేసింది. ఏడీఆర్ వివరాల ప్రకారం చంద్రబాబునాయుడు కుటుంబ ఆస్తులు రూ.931 కోట్లు కాగా, అప్పులు రూ.10 కోట్లుగా ఉంది.గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు దాఖలు చేసిన అఫిడివిట్ ప్రకారం, ఆయన పేరుతో రూ.36 కోట్ల ఆస్తులు, ఆయన భార్య భువనేశ్వరి పేరుతో రూ.895 కోట్లు ఉన్నాయి. వారి సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ షేర్లను కలిపి ఈ చిట్టా విడుదల చేశారు.
దేశంలో సగటు ముఖ్యమంత్రుల ఆదాయం ఏడాదికి రూ.13.64 లక్షలుగా ఉంది. రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంల మొత్తం సగటు ఆస్తి రూ.52.59 కోట్లుగా ఉంది.31 ముఖ్యమంత్రుల ఆస్తి మొత్తం రూ.1630 కోట్లు. చంద్రబాబు తరవాత స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ రూ.332 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు.
ఆస్తుల జాబితాలో మూడో స్థానంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నిలిచారు. ఆయన ఆస్తి రూ.51 కోట్లు. ఆయన అప్పులు రూ.23 కోట్లుగా ప్రకటించారు. రూ.55 లక్షల ఆస్తులతో జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా చివరి నుంచి రెండో స్థానంలో నిలిచారు. కేరళ సీఎం ఆస్తి రూ.1.18 కోట్లు చివరి నుంచి మూడో స్థానంలో విజయన్ నిలిచారు. రూ.15 లక్షల ఆస్తితో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అట్టడుగు స్థానంలో ఉన్నారు.