తిరుమల దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను కూడా అనుమతించాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు సమావేశమయ్యారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై చర్చించారు. ఎమ్మెల్యే, ఎంపీల లేఖలను అనుమతించాలని నిర్ణయించారు.
తెలంగాణ ప్రజాప్రతినిధులు నెలకు నాలుగు సిఫార్సులు చేసుకోవచ్చని టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు వెల్లడించారు. రెండు బ్రేక్ దర్శనాలు, రెండు రూ.300 టికెట్ల దర్శనానికి అనుమతిస్తామని ఆయన చెప్పారు.తెలంగాణ వారికి అన్యాయం జరుగుతోందనే ప్రచారాన్ని బిఆర్.నాయుడు కొట్టిపడేశారు.