మహా కుంభమేళా నిర్వహిణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. 50 వేల మందితో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 2500 సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఉంచనున్నారు.ప్రయాగ్రాజ్ కుంభమేళా ప్రాంతంలోకి ప్రవేశించే వారి ముఖ గుర్తింపులను రికార్డు చేయనున్నారు. తీవ్ర వాదుల ముప్పు పొంచి ఉండటంతో, నీటిలో సంచరించే డ్రోన్లతో కూడా నిఘా పెట్టారు.
కుంభమేళాకు యూపీ ప్రభుత్వం 5 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. భక్తుల బసకు ప్రత్యేకంగా గుడారాల గ్రామం నిర్మించారు. ప్లాస్టిక్ వినియోగం నిషేధించారు. 30 తాత్కాలిక బ్రిడ్జిలను నిర్మించారు. 90 కొత్త రోడ్లు వేశారు.జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం వద్ద భారీ కుంభమేళా జరగనుంది. ఈ మేళాకు 40 కోట్ల మంది హాజరవుతారని అంచనా.
45 రోజుల పాటు సాగే ఈ కంభమేళాకు దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి 4 వేల రైలు సర్వీసులను నడపనున్నారు. విదేశాల నుంచి కూడా లక్షలాది మంది మహాకుంభమేళాలో పాల్గొంటారని అంచనా. కుంభమేళా ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఒక్క సెకను కూడా విద్యుత్ అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు.