ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె. విజయానంద్‌ను నియమిస్తూ జీవో విడుదల చేశారు. ప్రస్తుత సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ పదవీ కాలం నేటితో ముగియనుంది. రేపు కొత్త సీఎస్‌గా కె.విజయానంద్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.విజయానంద్‌ను సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వ పొలిటికల్ కార్యదర్శి సురేష్ కుమార్ జీవో విడుదల చేశారు.
1992 ఐఏఎస్ క్యాడర్‌కు చెందిన విజయానంద్ పదవీ కాలం వచ్చే ఏడాది నవంబరు వరకు ఉంది. అతని కన్నా సీనియర్లు వై శ్రీలక్ష్మి, సాయి ప్రసాద్, సిసోదియా ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయానంద్‌కు అవకాశం కల్పించారు.
విజయానంద్ పలు శాఖల కార్యదర్శిగా పనిచేశారు. మూడు దశాబ్దాలకుపైగా పాలనా అనుభవం ఉంది. ప్రస్తుతం సీఎస్ పదవికి ఐదుగురు పేర్లు పరిశీలనలోకి రాగా, త్వరగా రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న విజయానంద్‌కు సీఎస్ పదవికి అవకాశం ఇవ్వాలని సీఎం చంద్రబాబునాయుడు నిశ్చయించారు.
సీఎస్‌గా అవకాశం కల్పించడంపై సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌కు విజయానంద్ ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలు కూడా విజయానంద్ నియామకంపై ఆనందం వ్యక్తం చేశారు.