జమ్మూకశ్మీర్ లో తీవ్రవాద చర్యలను భారత ఆర్మీ ఉక్కుపాదంతో అణచివేస్తోంది. జవాన్లు ప్రాణాలకు తెగించి ఇప్పటి వరకు సుమారు 60 శాతం పాకిస్తాన్ తీవ్రవాదుల్ని మట్టుబెట్టినట్లు భారత ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ప్రతీ ఐదురోజులకు ఒక టెర్రరిస్ట్‌ను, మొత్తంగా 75 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు తెలిపారు. చనిపోయినవారిలో అధిక శాతం పాకిస్తాన్ కు చెందిన ముష్కరులు ఉన్నారని తెలిపారు.
జమ్మూ, ఉధంపూర్, కథువా, దోడా, రాజౌరిలో మరణించిన 42 మందిలో స్థానికేతరులే ఎక్కువ మంది ఉన్నట్లు నివేదికల ద్వారా అర్థం అవుతుంది.
బారాముల్లా, బందిపొరా, కుప్వారా, కుల్గాం జిల్లాల్లో కూడా విదేశీ ఉగ్రవాదులను మట్టుబెట్టారు.
బారాముల్లాలో అత్యధికంగా తొమ్మిది ఎన్‌కౌంటర్లలో 14 మంది స్థానికేతర ఉగ్రవాదులు చనిపోయారు. సబురా నాలా , మెయిన్ ఉరి సెక్టార్, కమల్‌కోట్ ఉరి నియంత్రణ రేఖ వెంబడి, చక్ తప్పర్ క్రిరి, నౌపోరా, హడిపొర, సాగిపోరా, వాటర్‌గామ్, రాజ్‌పూర్‌లోని లోతట్టు ప్రాంతాలలో సెర్చ్ ఆపరేషన్లు జరిగాయి.
2024లో జమ్మూ కాశ్మీర్‌లో 60 ఉగ్రదాడి ఘటనలు జరిగాయి. వీటిలో 32 మంది పౌరులు, 26 మంది భద్రతా దళాల సిబ్బంది ప్రాణాలు చనిపోయారు. ఉగ్రదాడుల కారణంగా మొత్తం 122 మంది ప్రాణాలువిడిచారు.