తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి మరోసారి అరుదైన ఘనత సాధించింది. ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ర్యాపిడ్ ఛాంపియన్‌గా రికార్డు సృష్టించింది. టోర్నీలో 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి విజేతగా నిలించింది.
న్యూయార్క్‌లోని వాల్ స్ట్రీట్‌లో నేడు(డిసెంబర్ 29)న జరిగిన 11వ రౌండ్‌లో హంపి, ఐరీన్ సుకందర్(ఇండోనేషియా)ను ఓడించింది. ఈ టోర్నీలో మరో భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఐదో స్థానంలో నిలిచింది.
హంపి మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ సాధించడం ఇది రెండో సారి. 2019లో హంపి తొలిసారి తొలిసారి ఈ ఘనత సాధించింది. అంతకు ముందు చైనాకు చెందిన జు వెంజున్ మాత్రమే ఒకటి కంటే ఎక్కువ సార్లు ఈ టైటిల్ నెగ్గింది.
వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ పురుషుల విభాగంలో రష్యాకు చెందిన 18 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ వోలోదర్ ముర్జిన్ విజేతగా నిలిచాడు. ముర్జిన్ 13 రౌండ్లలో 10 పాయింట్లు సాధించి ఛాంపియన్‌గాఘనత సాధించాడు. భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేశి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తొమ్మిది రౌండ్లు పూర్తయ్యే వరకు అగ్రస్థానంలో కొనసాగిన అర్జున్, చివరి రౌండ్లలో వెనుకపడ్డాడు.
కోనేరు హంపి విజయం దేశానికే గర్వకారణమని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. ‘ఎక్స్’ వేదికగా హంపికి శుభాకాంక్షలు తెలిపారు. 2024 మన దేశ చెస్ క్రీడాకారులకు మరిచిపోలేని సంవత్సరమని ప్రశంసించారు.
అసాధారణమైన పట్టుదల, సంకల్పం, నైపుణ్యం హంపి సొంతమని ఏపీ మంత్రి లోకేశ్ అన్నారు.