దక్షిణ కొరియూ ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది. ల్యాండింగ్ గేర్ వైఫల్యంతో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 179 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. బ్యాంకాక్ నుంచి ముయూన్ బయలు దేరిన బోయింగ్ 737 విమానం ల్యాండ్ అవుతూ పట్టుతప్పింది. రక్షణ గోడను ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. వెంటనే పేలిపోయింది. ల్యాండింగ్ సమయంలో గేర్ వైఫల్యంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇద్దరు సిబ్బంది మినహా అందరూ చనిపోయారు.
ల్యాండింగ్ చేస్తున్న సమయంలో గేర్ వైఫల్యంతో ప్రమాదం జరిగిందని, దీంతో విమాన వేగం నియంత్రించుకోవడంలో ఫైలట్ విఫలమైనట్లు తెలుస్తోంది. అత్యంత వేగంతో విమానాశ్రయ రక్షణ గోడను ఢీ కొట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు.
విమానం ల్యాండింగ్ కోసం రెండు సార్లు ప్రయత్నం చేసి విఫలమైనట్లు గుర్తించారు. రన్ వే పై దిగిన తరవాత చివరకు వస్తున్న సమయంలో కూడా వేగ నియంత్రణ జరగలేదు. ల్యాండింగ్ గేర్లు పనిచేయకపోవడం, టైర్లు తెరచుకోక పోవడం వల్ల ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ముందుగా ఏదైనా పక్షిని ఢీకొని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దీని వల్ల ల్యాండింగ్ గేర్లలో సమస్య తలెత్తి ఉండవచ్చనే కోణంలో విచారిస్తున్నారు. ప్రమాద సమయంలో విమానంలో 175 మంది ప్రయాణీకులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. వీరిలో ఇద్దరు సిబ్బంది మినహా అందరూ ప్రాణాలు కోల్పోయారు.