రైతు సంఘాల నాయకులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నెల రోజులకుపైగా నిరాహార దీక్ష చేస్తోన్న రైతు సంఘం నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్‌కు వైద్యసాయం అందించకుండా అడ్డుకుంటున్న రైతు సంఘాల నేతలపై
జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సంఘాల నేతల తీరును న్యాయమూర్తి తప్పుపట్టారు. వెంటనే జగ్జీత్ సింగ్‌కు వైద్య సాయం అందించాలని పంజాబ్ ప్రభుత్వ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.
పంటల మద్దతు ధరలు పెంచాలంటూ పంజాబ్ హరియానా సరిహద్దు ఖనౌరీ వద్ద జగ్జీత్ సింగ్ నవంబరు 26 నుంచి నిరాహారదీక్ష చేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. వైద్య సాయం అందించాలని కోర్టు ఆదేశించింది. అయితే వైద్యులను నిరాహార దీక్షా శిబిరం వద్దకు వెళ్లకుండా రైతు సంఘాల నేతలు అడ్డుకుంటున్నారు. దీనిపై చండీఘడ్ హైకోర్టులో విచారణ జరిగింది. వెంటనే వైద్యసాయం చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. కేసును ఈ నెల 31కి వాయిదా వేశారు.
పంటలకు మద్దతు ధర పెంచడంతోపాటు, మరో 12 డిమాండ్ల సాధనలకు జగ్జీత్ సింగ్ నవంబరు 26 నుంచి నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యం క్షీణించి పరిస్థితి విషమంగా మారిందంటూ కొందరు కోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై ఇప్పటికే విచారణ జరిగింది. జగ్జీత సింగ్‌కు వైద్యసాయం అందకుండా రైతుసంఘాల నేతలు అడ్డుకోవడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.