అమెరికా జాతీయ పక్షిగా బాల్డ్ ఈగల్‌ను ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ అధికారికంగా ఆమోదిచారు . సంబంధిత బిల్లుపై సంతకం చేశారు. ఈ పక్షి చిత్రాన్ని దశాబ్దాలుగా అమెరికా అధికార చిహ్నంగా వాడుతుండగా, 1782 నుంచీ యూఎస్ గ్రేట్ సీల్‌పై, డాక్యుమెంట్లలో దేశ రాజముద్రపైనా దీనిని ఉపయోగిస్తున్నారు.
తెల్లటి తల, పసుపు పచ్చని ముక్కు, గోధుమ రంగు శరీరంతో ఉంటుంది. బాల్డ్ ఈగల్‌ను జాతీయ పక్షిగా ప్రతిపాదిస్తూ మిన్నెసోటా సభ్యుడు అమీ క్లోజౌచెర్ సెనెట్‌లో బిల్లు ప్రవేశ పెట్టారు. డిసెంబర్ 16న సభ ముందుకు వచ్చింది.
దానిని సభ ఏకగ్రీవంగా ఆమోదించగా బైడెన్ సంతకం చేసి ఆమోదించారు. దాదాపు 240 ఏళ్ల తరవాత బాల్డ్ ఈగల్‌కు జాతీయ పక్షి హోదా దక్కింది.
బాల్డ్ ఈగల్ ఉత్తర అమెరికాకు చెందిన పక్షి కాగా దీనిని మొట్టమొదట 1776లో మసాచుసెట్స్ రాగి సెంటుపై అమెరికా చిహ్నంగా ముద్రించారు. వెండి డాలర్, హాఫ్ డాలర్, క్వార్టర్ , యూఎస్ నాణేల వెనుక భాగంలోనూ ఉండేది.
1940 జాతీయ చిహ్న చట్టం కింద బాల్డ్ ఈగల్ రక్షిత పక్షి గా ప్రకటించి దాని క్రయ విక్రయాలు చట్టవిరుద్ధమని అమెరికా ప్రకటించింది.