ఫార్ములా ఈ రేసు అవినీతి కేసులో విచారణకు హాజరు కావాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది. ఈ కేసులో విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించిన వ్యవహరం ఉండటంతో ఈడీ రంగంలోకి దిగింది.
కేటీఆరుతోపాటు మరో ఇద్దరికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. వీరిని జనవరి 2,3 తేదీల్లో విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఫార్ములా ఈ రేసు అవినీతిపై తెలంగాణ ప్రభుత్వం ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్, పీఎంఎల్ఏ కింద ఈడీ నోటీసులు జారీ చేసింది.
ఫార్ములా ఈ రేసు అవినీతి కేసులో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాహకులకు ఫాండ్స్ రూపంలో విదేశీ మారక ద్రవ్యం చెల్లించింది. ఇందుకు ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉన్నా అలా చేయలేదు. ఇదే విషయాన్ని ఏసీబీ గుర్తించింది. విదేశీ కరెన్సీలో చెల్లింపులకు ఆర్బీఐ అనుమతి లేకుండా చేయడంతో ఈ కేసును ఈడీ కూడా విచారిస్తోంది.