బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్, భారత్ మధ్య మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు కు చేరుకుంది. మూడో రోజు ఆటలో భారత్ కు ఫాలో ఆన్ గండం తప్పింది.
తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి మరోసారి భారత జట్టుకు అండగా నిలిచాడు. బ్యాటింగ్ బౌలింగ్ లో ప్రతిభ చూపుతున్న నితీశ్ కుమార్ రెడ్డి, మెల్‌బోర్న్ టెస్టులోనూ కీలకసమయంలో జట్టును ఆదుకున్నాడు.
ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు దిగినా ఏ మాత్రం వెరవకుండా హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ వెంటనే ‘తగ్గేదేలే’ అంటూ ‘పుష్ప’ సినిమాలో హీరో మేనరిజాన్ని ప్రదర్శిస్తూ హర్షం వ్యక్తం చేశాడు. టీ బ్రేక్ సమయానికి భారత్ ఏడు వికెట్లు నష్టపోయి 326 పరుగులు చేసింది.
నితీశ్ కుమార్ రెడ్డి (85*), వాషింగ్టన్ సుందర్ (40*) పరుగులతో క్రీజులో ఉన్నారు.
రిషబ్ పంత్ ( 28), రవీంద్ర జడేజా(17), యశస్వీ (82), కోహ్లీ(36), కేఎల్ రాహుల్ (24) పరుగులు చేశారు.
తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 474 పరుగులు చేయగా మూడో రోజు టీ బ్రేక్ సమయానికి భారత్ 326 పరుగులు చేసింది. ఆసీస్ కంటే 148 పరుగులు వెనకబడి ఉంది.
ఆసీస్ బౌలర్లలో బోలాండ్ మూడు, కమిన్స్ రెండు, నాథన్ ఒక వికెట్ తీశారు.